మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌గా కావలి చంద్రయ్య నియామకం

జగద్గిరిగుట్ట (న్యూస్ విధాత్రి), మే 25:  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్‌గా కావాలి చంద్రయ్య (చెన్నయ్య) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన నియామక పత్రాన్ని గౌరవంగా స్వీకరించిన అనంతరం పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కావాలి చంద్రయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించిన ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేందర్ పాల్ గౌతమ్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, అలాగే టీపీసీసీ ఎస్సీ సెల్ నాయకుడు నాగరిగారి ప్రీతంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నియామక పత్రం

ఈ బాధ్యత తనకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, ఎస్సీ సమాజ హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. ఈ నియామకంతో జిల్లాలో ఎస్సీ సెల్ కార్యకలాపాలకు మరింత ఊపు వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More