రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన భాగ్యరధి విద్యార్థులు

• ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 12: ఆదివారం  విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతల్ లోని భాగ్యరధి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి విశేష విజయాన్ని సాధించారు. వివిధ గ్రూపుల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని మరింతగా పెంచారు.

ప్రథమ సంవత్సరంలో సత్తా చాటిన విద్యార్థులు

• ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ లో…
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో బి. అస్మిత 468/470 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. బైపిసి గ్రూపులో జి. విష్ణు తేజ 433/440 మార్కులు సాధించగా, ఎంఈసి గ్రూపులో బి. శ్రీ లక్ష్మి 491/500 మార్కులు సాధించింది. సిఈసి గ్రూపులో అమ్బ్రిన్ బేగం 485/500 మార్కులతో ప్రతిభ చాటింది.

ద్వితీయ సంవత్సరంలో సత్తా చాటిన విద్యార్థులు

• ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ లో…                   ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా విద్యార్థులు అదే స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరిచారు. బైపిసి గ్రూపులో అవేజ్ 993/1000 మార్కులు సాధించగా, ఎంపీసీ గ్రూపులో అమృత్, శివం ప్రసాద్ ఇద్దరూ 982/1000 మార్కులు సాధించారు. సిఈసి గ్రూపులో శ్రావణి 981/1000 మార్కులు, ఎంఈసి గ్రూపులో సానియా బేగం 979/1000 మార్కులు సాధించి ప్రతిభను చాటారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్. వెంకటరెడ్డి మాట్లాడుతూ… పదవ తరగతిలో సాధారణ మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని తమ కళాశాల మరోసారి నిరూపించిందన్నారు. విద్యార్థులకు అవసరమైన ఆర్థిక, విద్యా సహాయాన్ని యాజమాన్యం ఎల్లప్పుడూ అందిస్తుందని తెలిపారు. డైరెక్టర్ నల్ల జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ… ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరంలో ఉచిత విద్య అందజేస్తామని ప్రకటించారు. ఇంటర్‌తో పాటు జేఈఈ మెయిన్స్, నీట్, ఎప్సెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని మరో డైరెక్టర్ కె. రామకృష్ణ తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణలో కూడా తమ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారని కళాశాల ప్రతినిధి జీ. రమేష్ బాబు అన్నారు. ఈ విజయానికి కారణమైన అధ్యాపకులు, తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More