సుచిత్ర సర్కిల్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సుచిత్ర సర్కిల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు వీరారెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వీరారెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నో త్యాగాలు, పోరాటాలు, అమరవీరుల బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం సాగిన తెలంగాణ ఉద్యమం కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని, ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిషన్ రావు, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్, సమ్మయ్య, గోవర్ధన్ రెడ్డి, కుమార్, రామచంద్ర రెడ్డి, మధుకృష్ణ, కుంట వేణు, చంద్రశేఖర్ రెడ్డి, వీరంశెట్టి, శంకర్, రమణ రావు, మహిళా నాయకురాళ్లు పద్మ, ఇందిర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.