మల్లారెడ్డి మీడియా క్రికెట్ టోర్నీలో సత్తా చాటిన కుత్బుల్లాపూర్ జట్టు

• అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరుకున్న కుత్బుల్లాపూర్
• ఫైనల్ లో కంటోన్మెంట్ తో తలపడనున్న కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మార్చి: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కల్పనా రెడ్డి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మల్లారెడ్డి మీడియా క్రికెట్ టోర్నీని మంగళవారం ప్రారంభించారు. సూరారం లోని మల్లారెడ్డి ఆసుపత్రి క్రికెట్ మైదానంలో ప్రారంభించిన ఈ టోర్నీలో కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, కంటోన్మెంట్ ప్రాంతాల నుంచి ఒక్కొక్క జట్టు పాల్గొన్నాయి. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో కుత్బుల్లాపూర్ జట్టు మల్కాజ్ గిరి జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో జనార్దన్ రెడ్డి సారథ్యంలో కుత్బుల్లాపూర్ జట్టు అద్భుత ప్రదర్శనతో మల్కాజ్గిరి జట్టును ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. కుత్బుల్లాపూర్ జట్టు అన్ని విభాగాల్లో సమన్వయంతో ఆడి విజయం సాధించింది.

టోర్నీలో పాల్గొన్న కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, కంటోన్మెంట్ క్రికెట్ జట్లు

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కుత్బుల్లాపూర్ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. ఓపెనర్లు జనార్దన్ రెడ్డి, మాధవరెడ్డి మంచి సుభారంభాన్ని ఇవ్వగా అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్లు దానిని కొనసాగించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మల్కాజ్గిరి జట్టు కుత్బుల్లాపూర్ బౌలర్ల దాటికి నిలువలేకపోయింది. మొదటి నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచిన కుత్బుల్లాపూర్ జట్టు, వారిని కేవలం 64 పరుగులకే ఆలౌట్ చేసింది. ముఖ్యంగా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించారు. కుత్బుల్లాపూర్ జట్టులో 36 పరుగులతో పాటు, 3 వికెట్లు పడగొట్టిన కలికి మూర్తి (విధాత్రి న్యూస్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. బౌలింగ్ లో రవి (99 టీవీ) 3 వికెట్లు, దుర్గారావు(వాస్తవ తెలంగాణ), రవీందర్ రెడ్డి (బిగ్ టీవీ) చెరో రెండేసి వికెట్లు, నాగబాబు( విజన్ ఆంధ్ర) ఒక వికెట్ తీసుకోవడంతో పాటు, బ్యాటింగ్ లో జనార్దన్ రెడ్డి (టీ న్యూస్) 19, మహేందర్ రెడ్డి (సాక్షి) 16, మాధవరెడ్డి (సివిఆర్) 15 పరుగులు చేయగా శివాజీ (ఆర్ టివి), రాజేష్ (రాజ్ న్యూస్), ప్రవీణ్ (10 టీవీ) సమిష్టిగా రాణించి జట్టు విజయంలో భాగస్వాములయ్యారు. ఈ విజయం ద్వారా కుత్బుల్లాపూర్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లడం పట్ల సహచర మీడియా మిత్రులు, అభిమానులు, స్థానిక క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం జరగబోయే ఫైనల్‌లో కూడా ఇదే జోష్ కొనసాగించి ట్రోఫీని సొంతం చేసుకోవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన రెండవ మ్యాచ్ లో కంటోన్మెంట్ జట్టు మల్కాజ్గిరి జట్టుపై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. దీంతో ఫైనల్లో కుత్బుల్లాపూర్ జట్టు తో కంటోన్మెంట్ జట్టు తలపడనుంది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More