సత్ జ్ఞాన్ పాఠశాలలో బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకాలు
సత్ జ్ఞాన్ పాఠశాలలో బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ నివారణకు చేపట్టిన హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వెంకటేశ్వర నగర్లోని సత్ జ్ఞాన్ పాఠశాలలో మంగళవారం ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న సుమారు 75 మంది విద్యార్థినులకు ఉచితంగా హెచ్పీవీ టీకాను అందించారు. కుత్బుల్లాపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రిషిత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది టీకాలను విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రిషిత మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం బాలికల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉచితంగా హెచ్పీవీ టీకాను అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు రక్షణ కల్పించడంలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన బాలికలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించి ప్రభుత్వ సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సత్ జ్ఞాన్ పాఠశాలలో ఈ అవగాహన, టీకా కార్యక్రమాన్ని నిర్వహించిన కుత్బుల్లాపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బందికి పాఠశాల కరస్పాండెంట్ లయన్ చింతల మల్లేశం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది వరలక్ష్మి, స్నేహ, స్వప్న, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.