కూకట్పల్లి (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 22: ద్విచక్ర వాహనంపై అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని కూకట్పల్లి ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వై. నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం ఆధారంగా కె పి హెచ్ బి 9వ ఫేజ్ లోని నెక్సస్ ఫోరం మాల్ సమీపంలో కె. సింహాచలం అనే అనుమానిత ద్విచక్ర వాహనదారున్ని ఆపి పోలీసులు తనిఖీ చేశారు. ఈ మేరకు అతని వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లో 0.230 గ్రాముల డ్రై గంజాయి పట్టుబడింది. తాను తాగడానికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నానని విచారణలో నిందితుడు తెలిపాడు. అక్రమ గంజాయి కలిగి ఉండడంతో నిందితుడి ద్విచక్ర వాహనం (ఏపీ 07 బిసి 5751), సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్సై రశ్మిత, ఎక్సైజ్ కానిస్టేబుళ్ళు చంద్రశేఖర్, రాజు, జైపాల్, కృష్ణ పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.