బౌరంపేట్ పాక్స్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్స్ చైర్మన్ మిద్దల బాల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2014లో భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడం రాష్ట్ర ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితమని అన్నారు. స్వయంపాలన, సాంస్కృతిక గుర్తింపు, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాలు, ఆకాంక్షలు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఈ రోజు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్.వి. సురేందర్ రెడ్డి, ధర్మారెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, డైరెక్టర్లు సర్గారి భీమ్, సత్తి రెడ్డి, వార్డు అధ్యక్షుడు మన్నే శేఖర్, సీఈఓ అసాద్ తదితరులు పాల్గొన్నారు.