ఘనంగా వడ్డెర కార్పొరేషన్ నూతన చైర్మన్ ఆత్మీయ సమ్మేళనం
• ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
గాజులరామారం (న్యూస్ విధాత్రి), మే 24: వడ్డెర సమాజం సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో మరింత ముందుకు రావాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మంజుల్కర్ ఆధ్వర్యంలో గాజులరామారం చిత్తారమ్మ ఆలయ ప్రాంగణంలో వడ్డెర కార్పొరేషన్ నూతన చైర్మన్‌గా నియమితులైన గుంజ రేణుక నారాయణ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన శ్రీశైలం గౌడ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రేణుక నారాయణకు అభినందనలు తెలిపారు. వడ్డెర కులస్తుల అభివృద్ధికి చైర్మన్ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్డెర సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

అనంతరం వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక నారాయణ శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత వడ్డెర సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, గోగుల సరిత, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గిరిబాబు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్‌తో పాటు పలువురు వడ్డెర సంఘ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో వడ్డెర సంఘ సభ్యులు పాల్గొన్నారు.