కుత్బుల్లాపూర్ బీరప్ప ఆలయ మల్టీపర్పస్ హాల్ పునర్నిర్మాణానికి రూ.1.02 కోట్లు మంజూరు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 5: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో ఉన్న శ్రీశ్రీశ్రీ బీరప్ప ఆలయ మల్టీపర్పస్ హాల్ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1.02 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో, కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కృషి ఫలితంగా ఈ నిధులు మంజూరయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నిధుల మంజూరు సందర్భంగా ఆలయ కమిటీ ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ…బీరప్ప ఆలయ మల్టీపర్పస్ హాల్ పునర్నిర్మాణానికి రూ.1.02 కోట్ల నిధులు మంజూరు కావడం సంతోషకరమన్నారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కే.ఎం. గౌరీష్, బట్టపాల కృష్ణ, దమ్మని శ్రవణ్, సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్, పిట్ల ప్రవీణ్ ముదిరాజ్, కుత్బుల్లాపూర్ కురుమ సంఘం చైర్మన్ బి. నర్సింహా, వైస్ చైర్మన్ బాలరాజ్, నర్సింహా, రమేష్, సలహాదారులు ఎన్. పెంటయ్య, నగేష్, ప్రతాప్, అంజయ్య, సెలవోజి జి. సత్తయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు నార్లకంటి బాలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. సాయి కుమార్, ఉపాధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్, బి. యాదగిరి, సి. నాగేందర్, ఎన్. విజయకృష్ణ, రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సి. మహేందర్, జాయింట్ సెక్రటరీలు ఎన్. శంకర్, జి. మధు, ఎన్. బాలకృష్ణ, ఎన్. బీరప్ప, ట్రెజరర్ ఎన్. జగదీష్, మహిళా సెక్రటరీ కే. లక్ష్మితో పాటు కురుమ సంఘం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More