జీడిమెట్ల గాజులరామారం ఉప కమిషనర్ల బదిలీలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 23: జిహెచ్ఎంసి పరిధిలో సాధారణ బదిలీల్లో భాగంగా పలు సర్కిళ్ల ఉప కమిషనర్లను స్థాన చలనం చేస్తూ కమిషనర్ ఆర్ వి. కర్ణన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా జీడిమెట్ల సర్కిల్ ఉప కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న వి. నర్సింహను జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో జీడిమెట్ల సర్కిల్ నూతన ఉప కమిషనర్ గా డి. శంకర్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శంకర్ సింగ్ యూసఫ్ గూడ సర్కిల్ నుంచి బదిలీ అయ్యి జీడిమెట్ల సర్కిల్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే గాజులరామారం సర్కిల్ ఉప కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్ పి. మల్లయ్యను ఎన్నికల అనుబంధ కమిషనర్ గా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో గాజులరామారం నూతన ఉప కమిషనర్ గా శ్రీపాద రామేశ్వర్ ను నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.