హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), జూలై 9: రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఏ. గోపాల్ రావును రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా వనపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు బీజేపీలో తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే అందరినీ కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయాలని నూతన అధికార ప్రతినిధి ఏ. గోపాల్ రావుకు సూచించారు. ఈ సందర్భంగా ఏ. గోపాల్ రావు తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.