లయన్స్ ఇంటర్నేషనల్ 320-బి జిల్లా నూతన కమిటీ బాధ్యతల స్వీకారం

• జిల్లా గవర్నర్‌గా శైలజా నాయర్..
• ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా అవంతి రెడ్డి.. సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా చల్లా శ్రీనివాస్ రెడ్డి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 26: ఇంటర్నేషనల్ 320-బి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఇతర జిల్లాలు, క్లబ్‌లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ (పిఐడి) లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన 320-బి జిల్లా 11వ క్యాబినెట్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్‌గా శైలజా నాయర్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా అవంతి రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా చల్లా శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

నూతన జిల్లా గవర్నర్ శైలజా నాయర్ సేవా దృక్పథం, పట్టుదలతో పనిచేసే నాయకురాలని డాక్టర్ ఘట్టమనేని బాబురావు కొనియాడారు. ఆమె నాయకత్వంలో జిల్లాలోని అన్ని లయన్స్ క్లబ్‌లు మరింత చురుకుగా ప్రజాసేవా కార్యక్రమాలను విస్తృతం చేసి సమాజానికి మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్టాలేషన్ చైర్మన్ హలోక్ కుమార్ జా, మాజీ జిల్లా గవర్నర్లు సెల్వ సాయిరాంరాజు, రాజేంద్రప్రసాద్, ఎస్.ఎన్. రెడ్డి, దీపక్ భట్టాచార్య, విద్యాసాగర్ రావు, విజయ్ కుమార్ శెట్టి, మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ హేమల్ కన్విద్‌తో పాటు పలువురు లయన్స్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More