కుత్బుల్లాపూర్లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర అదనపు సీఈఓ సమీక్ష
• పారదర్శకమైన, తప్పులేని ఓటరు జాబితా లక్ష్యంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలి
• నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 27 : తెలంగాణ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సహాయ ఎన్నికల నమోదు అధికారుల (ఏఈఆర్వోలు)తో సోమవారం మధ్యాహ్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ప్రధానంగా అందుబాటులో లేని, నివాసం, చిరునామా మార్పు, మరణించిన, డూప్లికేట్, నకిలీ ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి స్థాయిలో ధృవీకరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా 85 సంవత్సరాలు పైబడిన ఓటర్ల ప్రొజెనీ మ్యాపింగ్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, క్రమబద్ధంగా ప్రక్రియలను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలోని వీవీఐపీ ఓటర్ల వివరాలు, ఎన్యూమరేషన్ ఫారం డేటా డిజిటైజేషన్ పురోగతిని కూడా సమీక్షించారు. ప్రతి నమోదు ఖచ్చితత్వంతో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఒకే ఇంటి వద్ద పలువురు ఓటర్లుగా గుర్తించిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని ఆదేశించారు. స్వచ్ఛమైన, పారదర్శకమైన, తప్పులేని ఓటరు జాబితా తయారే లక్ష్యంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి హెచ్చరించారు. స్వచ్ఛమైన, పారదర్శకమైన, తప్పులేని ఓటరు జాబితా లక్ష్యంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఈఆర్వోలు శంకర్ సింగ్, వెంకట్రాములు, స్పందన, రాజేష్, వాణి రెడ్డి, ప్రమీల, ఉదయ్ కుమార్, వేణు, రమేష్, పవన్ కుమార్, ప్రవీణ్ కుమార్, నర్సింగ్ రావు, సుమిత్ర పాల్గొన్నారు